Breaking News

చెరువుల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

చెరువుల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

సామాజికసారథి, బిజినేపల్లి: సాకలివాని,చెరువు ఈదుల్ చెరువు, మొద్దుల కుంటలను ఆక్రమించుకుని అన్యాక్రాంతం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని మత్స్య సహకార సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. సర్వేచేసి ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లను ఫిక్స్​ చేయాలని మండల జనరల్ బాడీ మీటింగ్ లో వినతిపత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఎంపీపీ, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లను కూడా కలిశామన్నారు. బిజినేపల్లి చెరువు కుంటలను ఆక్రమిస్తున్న నాయకులకు సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనవరి 2న సామరస్య శాంతియుత దీక్షను బిజినేపల్లి మండల ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బిజినేపల్లి మండలం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు తుమ్మల అల్లోజీ. బి.ఆంజనేయులు టి.శేఖర్, కంపిల లక్ష్మయ్య, కేబీ శ్రీధర్, కె.నరిసింహ, బి.ఈశ్వర్, ఎన్​.కొండల్, మెట్టు శాంతయ్య, జి.తిరుపతయ్య కె.వెంకట్రాములు. జి.ఘంట, కె.రమేష్, శివ పాల్గొన్నారు.