….జర్నలిస్టులతో కలెక్టర్ ఉదయ్ కుమార్
సారథి , నాగర్ కర్నూలు: అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు అందిస్తామని, వివిధ కారణాలవల్ల దరఖాస్తు చేసుకొని వారికి మరొక అవకాశాన్ని కల్పించడం జరుగుతుందని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం టియుడబ్ల్యూ-జేహెచ్143 జర్నలిస్టు సంఘం నాయకులు కలెక్టర్ ను కలిసిన సందర్భంగా కలెక్టర్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని ఇతర జిల్లాలలో ఇచ్చిన విధంగా పత్రికలు, న్యూస్ చానల్స్, ఫోటో,వీడియో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందించాలని, కమిటీ ఆమోదం లేకున్నా జారీ చేసిన అక్రిడేషన్ లను రద్దు చేయాలని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. జర్నలిస్టుల అక్రిడేషన్ ల విషయంలో టియుడబ్ల్యూజే నాయకులు చర్చించారు. అనంతరం టియుడబ్ల్యూజే -హెచ్ 143 రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. అదేవిధంగా వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని జర్నలిస్టులు, గతంలో విద్యార్హత ఇతర ధ్రువీకరణ పత్రాలు జతపరచకుండా కార్డు రానివారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని జర్నలిస్టులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే- హెచ్143 రాష్ట్ర నాయకులు ఉమాశంకర్, మహమ్మద్ రావుఫ్,టియుడబ్ల్యూజే-హెచ్143 జిల్లా గౌరవ అధ్యక్షులు సాక్షి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ముమ్మడి శేఖరా చారి, జిల్లా అధ్యక్షుడు ఖానాపురం ప్రదీప్, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాగర్ కర్నూల్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు సాయిలు సాగర్ లతోపాటు కొల్లాపూర్,అచ్చంపేట,కల్వకుర్తి,నాగర్ కర్నూల్ నియోజకవర్గాలకు చెందిన ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో,వీడియో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.