సామాజిక సారధి , బిజినపల్లి : మండల పరిధిలోని పాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై రమేష్ ( 30)అనే యువకుడు మృతి చెందాడు . కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం త్రాగునీరు రావడంతో బోరు మోటర్ వేసేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ జరిగిందని అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు . మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు . మృతుడు గ్రామంలోని ల్యాబ్ టెక్నీషియన్ నిర్వహుడుగా ఉంటూరని తెలిపారు . దీంతో చిన్న వయసులోనే విద్యుత్ షాక్ గురై మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు మొదలయ్యాయి .
- April 16, 2023
- Archive
- తెలంగాణ
- మహబూబ్నగర్
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి