సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ‘ఒక రాత్రి నా వద్ద రమ్మని’ యువకుడు.. ఓ యువతిని అడిగారు. ఆమె అంగీకరించకపోవడంతో ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. చావు దెబ్బలు కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెంలో వెలుగుచూసింది. బాధితురాలి కథనం.. గ్రామానికి చెందిన ఓ యువకుడు(23), యువతి(22) ఇండ్లు పక్కపక్కనే ఉన్నాయి. అమ్మాయి కూడా పక్క ఇళ్లే కదా అని చనువుగా మాట్లాడేది.. ఉండేది. ఇదే అదనుగా భావించిన సదరు యువకుడు ఆ యువతిని ఈనెల 16న రాత్రి వారి ఇంటికి వెళ్లి ‘ ఒక రాత్రి నా వద్దకు రమ్మని’ అడిగాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన సదరు యువకుడు ఆమె ముఖంపై విపరీతంగా కొట్టాడు. ముఖమంతా చిట్లపోయి నల్లగా మారింది.. దెబ్బలకు తాళలేక మూర్చపోయింది. అక్కడే పడిపోవడంతో స్థానికులు ఇంటికి చేర్చారు. ఆమె చేసేది లేక ఈనెల 17న బిజినేపల్లి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యువకుడి తరపున అతని బంధువులు, రాజకీయ నాయకులు రంగంలోకి దిగి కేసు కాకుండా చూస్తున్నారు. ఆమె మనసు, హృదయానికి తగిలిన గాయానికి బేరం కట్టే ప్రయత్నం చేస్తున్నారు.
- June 18, 2023
- Archive
- Top News
- క్రైమ్
- Comments Off on ‘రాత్రి రానుందుకు’ యువతిపై దాడి