సామాజిక సారథి , బిజినేపల్లి: ప్రమాదవశాత్తు ఇంటి ఆరు బయట ఆడుకుంటూ వెళ్తూ ఇంటి ముందల ఉన్న బకెట్లో పడి సంవత్సరం బాలుడు మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం బిజినపల్లిలో చోటుచేసుకుంది . కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బిజినపల్లి గ్రామానికి చెందిన మిద్దె కృష్ణయ్య , రేణుక అనే దంపతులకు సంవత్సర కాలం క్రితం బాలుడు జన్మించాడు . ఆ బాలుడికి భరత్ అనే పేరును పెట్టుకున్నారు . కానీ అల్లారు ముద్దుగా పెంచుకున్న సంవత్సర బాలుడు భరత్ ఆడుకుంటూ ఇంటి బయట నీటితో ఉన్న బకెట్లో పడి చనిపోయినట్లు తెలిపారు . ఇంటి పనులు చేసుకుంటున్న కుటుంబ సభ్యులు ఆరుబయట తమ కుమారుడు ఆడుకుంటున్నాడని అనుకోని కొంతసేపటి తర్వాత బయటికి వచ్చి చూసేసరికి బకెట్లో పడి ఉన్న బాలుని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు .
- June 26, 2023
- Archive
- Top News
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on బకెట్లో పడి సంవత్సరం బాలుడు మృతి