ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం
సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్లో ఓ ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి ఇంటి యజమానితో పాటు ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతులు యజమాని శివయ్య(50), ఆయన భార్య పద్మ(45), పద్మ అక్క కుమార్తె మౌనిక(23), ఆమె ఇద్దరు కుమార్తెలతో పాటు.. మరో బంధువైన శాంతయ్యగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలపై డీసీపీ అఖిల్ మహాజన్ ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందండం పట్ల ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర దిగ్ర్భాంతి చెందారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతిచెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విచారణ వేగవంతం చేయాలని విప్ అధికారులను ఆదేశించారు.