- ఓ విద్యార్థినిపై చిల్లర చేష్టలు
- దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు
- పోలీసుల అదుపులో కీచక టీచర్
సామాజికసారథి, అచ్చంపేట: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజాన్ని చక్కదిద్దాల్సిన గురువులు పక్కదారిపడుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన వారు పాడు పనులను పాల్పడుతున్నారు. అచ్చంపేటకు చెందిన సిధార్థ మహాదేవ్ అలియాస్ పర్వతాలు మున్ననూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. విద్యార్థినులతో చనువుగా ఉంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారిని చేతులతో తడుముతూ చిల్లర పనులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఓ విద్యార్థినికి సెల్ ఫోన్ ఇప్పించి మరీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సదరు విద్యార్థిని అసలు విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో వారు ఆరా తీయగా సిధార్థ మహాదేవ్ అలియాస్ పర్వతాలు ఆకృత్యాలు వెలుగుచూశాయి. దీంతో అచ్చంపేటకు వెళ్లి సిదార్థ మహాదేవ్ కు దేహశుద్ధి చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.