Breaking News

అన్నివర్గాలను గౌరవించే గొప్ప సంప్రదాయం

అన్నివర్గాలను గౌరవించే గొప్ప సంప్రదాయం
  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సామాజిక సారథి, పటాన్ చెరు: అన్ని వర్గాల ప్రజలను గౌరవించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రజలదని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా సోమవారం పటాన్ చేరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం పటాన్చెరు నియోజకవర్గం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ అందజేస్తున్నామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులను ప్రాధాన్యత అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతు పండించిన ప్రతి వరి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. పటాన్ చెరు మండల వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచే సిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్. ఎంపీపీ ఎమ్మెల్యే జీఎంఆర్ ను ఘనంగా సన్మానించారు.

 ఈ కార్యక్ర మంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మధుసూదన్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్టల్, సందీప్ షా, సంజయ్ సింగ్, జై కిషన్, భారీ సంఖ్యలో ఉత్తర భారతీయులు పాల్గొన్నారు. ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి, డైరెక్టర్లు, నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.అదే విధంగా అమీన్ పూర్ మండలంలోని వడక్ పల్లిలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ దేవానంద్ ముదిరాజ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.