Breaking News

ద్యావుడా…. ఏకంగా రూ.21.47 కోట్ల కరెంట్​ బిల్లు!

ద్యావుడా.... ఏకంగా రూ.21.47 కోట్ల కరెంట్​ బిల్లు!

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: అధికారుల తప్పిదాలు కొన్నిసార్లు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా అచ్చంగా ఇలాంటిదే మరి. వివరాల్లోకెళ్తే.. ఓ ఇంటిలో సాధారణంగా నాలుగు లైట్లు. ఓ మూడు ఫ్యాన్లు, మొబైల్​ ఛార్జర్స్​.. ఎలక్ట్రికల్​ ఇస్త్రీ పెట్టే, కూలర్​, లేదంటే ఏసీ ఉంటుంది. వంటింట్లో కరెంట్​ హీటర్​, మిక్సింగ్​ గ్రౌండర్​ వాడుతుండటం మనందరికీ తెలిసిందే. అయితే వీటన్నింటికీ కలిపి ఎంత లేదన్నా రూ. వెయ్యి నుంచి రూ.2వేలకు కరెంట్​ బిల్లు దాటదు. మహా అయితే ఓ రూ.4వేలో.. రూ.5వేలో వస్తుంటుంది. కానీ నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం ఖానాపూర్​ గ్రామంలో నవీన్​ రెడ్డి(గీతారెడ్డి) అనే వ్యక్తి ఇంటికి ఏకంగా అక్షరాల రూ.21 కోట్లా 47 లక్షల కరెంట్​ బిల్లు వచ్చింది. విద్యుత్​ సిబ్బంది వచ్చి బిల్లు కాగితం కొట్టి చేతికి ఇవ్వగానే ఆయన నివ్వెరపోయాడు. కొద్దిసేపు ఆయనకు నోటివెంట మాట రాలేదు. ఇదేమిటని పరేషాన్​ అయ్యాడు. విద్యుత్​ శాఖ అధికారుల తప్పిదం కారణంగా ఇలా జరిగిందని గుర్తించాడు. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. బిల్లు కట్టాలని చెబుతారా..? లేదంటే తమదే తప్ప జరిగిందని ఒప్పుకుంటారా?.. అధికారులు ఏం చెబుతారో చూడాలి. మొత్తంగా కరెంట్​ బిల్లు అందరినీ షాక్​ కు గురిచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *