Breaking News

జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యపై సర్క్యులర్ జారీ చేయాలి

టి యు డబ్ల్యూ జే -హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు..
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలను ఉచిత విద్యను అందించడానికి సర్కులర్ జారీ చేయాలని పియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు కానాపురం ప్రదీప్ ఐజేయు జాతీయ నాయకుడు జెమినీ సురేష్ ల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారిని శుక్రవారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా టీయూడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ ఆధ్వర్యంలో ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు. ఫోటో & వీడియో, డెస్క్ జర్నలిస్టు నా పిల్లలకు గతంలో మాదిగ ఏడాది కూడా సర్క్యులర్ను జారీ చేయాలని కోరడం జరిగిందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా విద్యను అందించాలని కోరుతున్నామాన్నారు.గత కొన్ని ఏళ్లుగా నాగర్ కర్నూల్ జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్న విధంగా.

ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఒక్కోజర్నలిస్టు కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను అందించే విధంగా జిల్లా లోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. గతంలో ఇచ్చిన మాదిరిగా ఈ విద్యాసంవత్సరానికి కూడా ఒక సర్క్యులర్ ను జిల్లా లోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి జారీ చేయాలని కోరగా ఇందుకు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు సానుకూలంగా స్పందిస్తూ సర్కులర్ జారీకి సానుకూలంగా స్పందిస్తూ ఒకటి రెండు రోజుల్లో అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజేష్ గౌడ్, 6 టీవీ శ్రీనివాస్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ లు ఉమా శంకర్, అహ్మదుల్లా ఖాన్, బాబు సాగర్, ఫోటో జర్నలిస్టు సంఘం జిల్లా నాయకులు కపిల వై రాజు, జర్నలిస్టులు సత్యం, బాలస్వామి, ఎమ్మార్ కే న్యూస్ రామకృష్ణ, మహమ్మద్ సాదిక్, ఏటిగడ్డ వెంకటేష్, ఆనంద్, 19tv శేఖర్,బిగ్ టివి ప్రకాష్ ఫోటో జర్నలిస్ట్ వీరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *