కోల్కతా: కరోనా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో ఆగస్ట్ 31 వరకు లాక్డౌన్ పొడిగించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వారంతపు( వారంలో రెండురోజులు) లాక్డౌన్ విధిస్తున్నారు. ఈద్ సందర్భంగా ఆగస్ట్ 1న లాక్డౌన్ విధించబోమని ఆమె స్పష్టం చేశారు. వారంలో ఏయేరోజు లాక్డౌన్ విధిస్తామో ప్రభుత్వం ముందుగానే తెలియజేస్తుందని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నదన్నారు. కరోనా విపత్తువేళ కేంద్రప్రభుత్వం తమ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నదని మమత ఆరోపించారు.
- July 28, 2020
- Archive
- జాతీయం
- BENGAL
- CM
- KOLKATTA
- LOCKDOWN
- పశ్చిమబెంగాల్
- మమతా బెనర్జీ
- Comments Off on పశ్చిమబెంగాల్లో లాక్డౌన్ పొడగింపు