- భారత్ లో కరోనా విలయతాండవం..
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉన్నది. గత 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుని.. దేశంలో దీని బారినపడిన వారి సంఖ్య 60 లక్షలకు చేరువైంది. కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 88,600 మంది ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 59,92,533కు చేరింది. వీరిలో 49 లక్షల మందికిపైగా కోలుకోగా.. 9 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. కాగా, కరోనా వచ్చి మరణించినవారి సంఖ్య 95 వేలకు దగ్గరలో ఉంది. గత 24 గంటల్లో మరణించినవారి(1,124) తో కలుపుకుని.. భారత్ లో కరోనా సోకి మరణించిన వారు 94,503 మంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సోకిన వారి సంఖ్య 3.3 కోట్లకు చేరగా.. 10 లక్షల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.