ఢిల్లీ: మనదేశంలో కరోనా కోరలు చాస్తూనే ఉంది. గత 24 గంటల్లో 6,61,715 టెస్టులు చేయగా.. 52,050 కొత్తకేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 18,55,745 కు చేరుకుంది. కాగా, ఇప్పటివరకు మొత్తం 12,30 509 మంది కోలుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 38,938కు చేరుకుంది. 5,86,298 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.