సారథి, అచ్చంపేట: అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు విజ్ఞప్తి మేరకు స్థానిక సివిల్ ఆస్పత్రికి నాలుగు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు స్పోటన్ లాజిస్టిక్ సంస్థ వారు, అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి, డీఎంహెచ్ వో డాక్టర్ కె.సుధాకర్ లాల్ చేతులమీదుగా మంగళవారం అందజేశారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించగలమని డీఎంహెచ్ వో అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, స్పోటన్ లాజిస్టిక్స్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు స్టీఫెన్, హర్ష, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణ, డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్, డాక్టర్ తారసింగ్, డాక్టర్ అరుణ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
- June 1, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- ACHAMPET
- MLA GUVVALA
- అచ్చంపేట
- ఎమ్మెల్యే గువ్వల
- కాన్సన్ ట్రేటర్లు
- Comments Off on అచ్చంపేట ఆస్పత్రికి 4 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు