న్యూఢిల్లీ: కోవిడ్-19 కేసులసంఖ్య భారత్లో అంతకంతకూ పెరుగుతున్నది. కేవలం గత నాలుగు రోజుల్లేనే లక్షకేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటివరకు మొత్తం కేసులసంఖ్య 8,49,553కు చేసింది. గత 24 గంటల్లో 28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడి 22,674 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా శనివారం 2,80,151 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.