సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో నాలుగు కస్తూర్బాగాంధీ(కేజీబీవీ) బాలికల స్కూళ్ల భవనాల నిర్మాణాలకు రూ.14 కోట్లు మంజూరైనట్లు మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా జిల్లాలో మండలానికి ఒక కస్తూర్బా బాలికల పాఠశాలను మంజూరు చేశామని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం తొగుట, రాయ్ పోల్ మండలాలు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం, జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాల భవనాలకు, ఒక్కో భవనానికి రూ.3.5 కోట్ల చొప్పున మొత్తం రూ.14 కోట్లు మంజూరుచేసినట్లు చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభించి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
- November 16, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- DUBBAKA
- HARISHRAO
- KGBVS
- KOMURAVELLI
- SIDDIPETA
- కొమురవెల్లి
- దుబ్బాక
- సిద్దిపేట
- హరీశ్‌రావు
- Comments Off on 4 కేజీబీవీలకు రూ.14 కోట్లు మంజూరు