ఢిల్లీ: భారత్లో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,67,323 కు చేరుకుంది. ఇప్పటివరకు 24 లక్షల మంది కోలుకోగా.. ఏడు లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 848 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 58,390కు చేరింది. అయితే ప్రస్తుతం పాజిటివిటీ రేటు 8.6 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 68 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
- August 25, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- DEATHS
- DEPARTMENT
- HEALTH
- INDIA
- NEWCASES
- కరోనా
- కొత్తకేసులు
- పరీక్షలు
- మరణాలు
- Comments Off on 3.68 కోట్ల కరోనా పరీక్షలు