- సంగారెడ్డి జిల్లాలో రైతుబంధు జమ
- వెల్లడించిన కలెక్టర్ హనుమంతరావు
సామాజిక సారథి, సంగారెడ్డి: రైతుబంధు పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో 8 విడతలుగా 2,71,756 మంది రైతుల ఖాతాల్లో 2, 453 కోట్ల 48 లక్షల 26 వేల 654 రూపాయలు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు . జిల్లాలో తొలి విడత 280,50,35,800 రూపాయలు, రెండవ విడత 268 కోట్ల 08 లక్షల 87 వేల 450 రూపాయలు, మూడవ విడతల 297 కోట్ల 78 లక్షల 21 వేల 640 రూపాయలు, నాలుగో విడతలో 216 కోట్ల 45 లక్షల 76 వేల 58 రూపాయలు ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఐదో విడత లో రూ. 366 కోట్ల 71 లక్షల 8 వేల 450, ఆరో విడత రూ. 368 కోట్ల 70 లక్షల 28 వేల 425 , ఏడో విడత రూ.366కోట్ల 86 లక్షల 47 వేల 211, ఎనిమిదో విడత రూ. 288 కోట్ల 40 లక్షల 7 వేల 100 రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
నియోజకవర్గాల వారిగా
జనవరి 12 తేదీ నాటికి నియోజక నియోజకవర్గాల వారిగా 8 విడతల్లో సరాసరిగా లబ్ధి పొందిన రైతులు, జమ చేసిన రైతు బంధు మొత్తం రూపాయల వివరాలను ఆయన వెల్లడించారు. ఆందోల్ 64657 మంది రైతులకు రూ.574.47 కోట్లు, నారాయణఖేడ్ లో 64958 మంది రైతులకు రూ.657.02 కోట్లు, పటాన్చేరులో 21497 మంది రైతులకు రూ.140.98 కోట్లు, సంగారెడ్డిలో 44149 మంది రైతుల రూ.341.04 కోట్లు, జహీరాబాద్ లో 59692 మంది రైతుల రూ.622.48 కోట్లు, నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలో 15802 మంది రైతులకు రూ.117.33 కోట్లు రైతు ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. రైతు బంధు ద్వారా జిల్లాలో అత్యధికంగా నారాయణఖేడ్ నియోజకవర్గం రైతులు లబ్ధి పొందినట్లు ఆయన తెలిపారు.