సారథి న్యూస్, సూర్యాపేట: గాల్వన్ లోయలో చైనా సైనికులు జరిపిన దాడిలో మృతిచెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈనెల 22న సీఎం కేసీఆర్ సూర్యాపేటకు రానున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం కల్నల్ కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించారు. భవిష్యత్‌లో కుటుంబ అవసరాల రీత్యా రూ.ఐదుకోట్ల నగదు, ఇంటి జాగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. అలాగే సంతోష్‌బాబు సతీమణికి గ్రూపు 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారని వెల్లడించారు.
- June 20, 2020
- Archive
- Top News
- జాతీయం
- CM KCR
- SANTHOSH BABU
- కల్నల్ సంతోష్ బాబు
- కేసారం
- సూర్యాపేట
- Comments Off on 22న సంతోష్‌బాబు ఇంటికి సీఎం కేసీఆర్