Breaking News

200 ఫేస్‌బుక్ అకౌంట్ల డిలిట్​

న్యూయార్క్​: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ దాదాపు 200 అకౌంట్లను డిలీట్ చేసింది. శ్వేత జాతీయుల ఆధిపత్యానికి చెందిన గ్రూపులను ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాం నుంచి రిమూవ్ చేసింది. నల్ల జాతీయులను ఆందోళనల్లో పాల్గొని విద్వేశాలను రెచ్చగొట్టేలా గ్రూపులు ఉన్నాయనే కారణంతో వాటిని తొలగించినట్టు కంపెనీ అధికారులు వెల్లడించారు.

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు కలిగిన ప్రౌడ్ బోయ్స్, అమెరికన్ గార్డుకు సంబంధించిన రెండు హేట్ గ్రూపులను ఇదివరకే ఫేస్ బుక్ బ్యాన్ చేసింది. మిన్నెపాలీస్‌లో జార్జ్ ప్లాయిడ్ మృతి ఘటనపై కొనసాగుతున్న నిరసనలకు సంబంధించి పోస్టులను ఆయా అకౌంట్ల తొలగింపుపై ఇదివరకే మానిటరింగ్ చేస్తున్నట్టు పేర్కొంది.ఈ గ్రూపుల్లో ర్యాలీ మద్దతుదారులు, సభ్యులను ఆందోళనలో పాల్గొనే ప్రేరేపించేలా ఉన్నాయని గుర్తించినట్టు తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఆయుధాలతో కూడా నిరసనల్లో పాల్గొనాలని విద్వేశపూరితంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని గుర్తించినట్టు ఫేస్ బుక్ కౌంటర్ టెర్రరిజం, డేంజరస్ ఆర్గనైజేషన్ పాలసీ డైరెక్టర్ బ్రెయిన్ ఫిష్ మ్యాన్ తెలిపారు. తొలగించిన అకౌంట్ యూజర్ల వివరాలను బహిర్గతం చేసేందుకు కంపెనీ నిరాకరించింది. మొత్తం మీద 190 అకౌంట్లను తొలగించినట్టు ఫేస్ బుక్ స్పష్టం చేసింది.