ఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15,31,669 మంది కరోనా బారినపడ్డారు. కేవలం గత 24 గంటల్లోనే 48,513 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 5,09,447 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 34,193 మంది కరోనాతో మృతిచెందారు. 9,88,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. త్వరలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.