సారథి న్యూస్, అమరావతి: ఈ నెల 15 తర్వాత ఆంధ్రప్రదేశ్ లో షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. లాక్‌డౌన్ సమయంలో షూటింగ్‌లు స్తంభించిపోయాయని, దీంతో షూటింగ్‌లు చేసుకునేందుకు అనుమతి ఇస్తామని జగన్ చెప్పారన్నారు. త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని సీఎం చెప్పారని, సినీపరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారన్నారు. విశాఖలో స్టూడియోకు గతంలో వైఎస్ చేసిన భూ కేటాయింపులను పునపరిశీలిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్ ఛార్జీలు ఎత్తివేయాలని కోరామని దానిపై సానుకూలంగా స్పందించారన్నారు. 2019-20 నంది అవార్డులు ఇచ్చేందుకు అంగీకరించినట్టు చిరంజీవి చెప్పారు..
- June 9, 2020
- Top News
- CHIRANJEEVI
- YS JAGAN
- ఏపీ
- చిరంజీవి
- జగన్
- షూటింగ్స్
- Comments Off on 15 తర్వాత ఏపీలో షూటింగులు