సారథి న్యూస్, మహబూబ్‌నగర్: జిల్లాలో కరోనా మహమ్మారి పెరుగుతోంది. జిల్లాలో 12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. విధుల్లో ఉండే పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రెమారాజేశ్వరి సూచించారు. డ్యూటీలో ఉన్న సమయంలో సామాజిక దూరం పాటిస్తూనే తప్పనిసరిగా మాస్క్‌లు కట్టుకోవాలని సూచించారు. జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. నవాబ్‌పేట మండలం కొల్లూరు గ్రామంలో మీసేవ నిర్వాహకుడు కరోనాతో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.
- June 30, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- MAHABUBNAGAR
- POLICE
- కరోనా
- పోలీసుశాఖ
- మహబూబ్‌నగర్
- Comments Off on డ్యూటీలో అప్రమత్తంగా ఉండండి