పవన్ బర్త్ డే కోసం ఫ్యాన్స్ కలలు ఈరోజు తీరాయి అనిపిస్తోంది. ఓ వైపు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్, మరోవైపు క్రిష్ జాగర్లమూడి చిత్రం తాలూకూ ఫస్ట్ లుక్, ఇప్పుడేమో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజై అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. పవన్ కెరీర్ లో 28వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవిశంకర్ నిర్మించనున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను రీలీజ్ చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ ఇండియా గేట్, స్వాతంత్ర్య సమరయోధులు సర్ధార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ చిత్రాలు కనిపించేలా డిజైన్ చేశారు. ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష పుస్తకంతో పాటు రోజాపువ్వు కనిపిస్తోంది. ‘బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మళ్లీ వస్తోంది.. ఈసారి ఇది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు’ అంటూ రిలీజ్ చేసిన ఈ కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా రామ్– లక్ష్మణ్ లు ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు.
- September 2, 2020
- Archive
- Top News
- సినిమా
- BLOCKBUSTER
- HARISHSHANKAR
- PAWANKALYAN
- POWERSTAR
- VAKILSAB
- పవన్‌కళ్యాణ్
- పవర్ స్టార్
- బ్లాక్‌బస్టర్
- వకీల్‌సాబ్
- హరీశ్‌శంకర్
- Comments Off on ట్రీట్ అదిరింది..