Breaking News

హ్యాపీ బర్త్ డే విజయ్ సార్..

లాక్ డౌన్ లేకుంటే కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ పుట్టినరోజును పెద్ద ఎత్తున జరుపుకునే వాళ్లు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ‘మహానటి’ కీర్తి సురేష్ మాత్రం విజయ్ కు చాలా స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘మాస్టర్’ చిత్రం నుంచి విడుదలైన కుట్టి స్టోరీ సాంగ్ కు ఆమె వయోలిన్ ప్లే చేస్తూ.. ‘జీవితం చాలా చిన్నది.. ఎప్పుడూ ఆనందంగా ఉండండి. హ్యాపీ బర్త్ డే విజయ్ సార్. మీ బర్త్ డే రోజున ఓ చిన్న వీడియో’ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వీడియో పోస్ట్ చేశారు కీర్తిసురేష్..

https://youtu.be/HEh4dV_WT5w
KEERTHY SURESH

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కీర్తి ఇప్పటి వరకు అద్భుతంగా యాక్ట్ చేయడం అందరూ చూశారు కానీ వయోలిన్ కూడా అద్భుతంగా ప్లే చేస్తుందని దీంతో అర్థమయ్యింది. దీంతో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోను కేవలం గంట వ్యవధిలో దాదాపు మూడు లక్షల మంది వీక్షించారు. గతంలో విజయ్, కీర్తిసురేష్ కాంబినేషన్ లో ‘భైరవ’, ‘సర్కార్’ సినిమాలు తెరకెక్కాయి. కాగా ఇటీవల ఆమె నటించిన ‘పెంగ్విన్’ చిత్రం ఓటీటీ ద్వారా విడుదలైంది. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం కీర్తి ‘సర్కారు వారి పాట’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించనుంది.