మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే.. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి దీనికి సంబంధించిన అప్ డేట్ ఏమీ రాదేమోనని ఫ్యాన్ అంతా డీలా పడిపోయారు. పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హంగామా చేయొద్దని ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశాడు ఎన్టీఆర్.. కానీ ఊహించని విధంగా ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ డైహార్డ్ అభిమానులకు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేశాడు. ‘హ్యాపీ బర్త్ డే టు తారక్..’ అంటూ కండలు తిరిగిన దేహంతో ఉన్న ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ డబు రత్నాని ఈ ఫొటో షూట్ చేశాడు. తారక్ బర్త్ డేకు స్పెషల్ గిఫ్ట్ అందిస్తానని మంగళవారం ఉదయం అనౌన్స్ చేసి సాయంత్రానికి కల్లా ఇలా ఫొటోని సోషల్ మీడియాలో ఉంచడంతో అభిమానులంతా ఫుల్ ఖుషీ అవడమే కాదు వెంటనే ఈ పిక్ ను ‘హ్యాపీ బర్త్ డే మై హీరో’ అని వైరల్ చేసేస్తున్నారు.