సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని నేషనల్హైవేల వెంట ఇరువైపులా రంగురంగుల పూల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎర్రమంజిల్ ఆర్అండ్ బీ ఆఫీసులో సమీక్షించారు. రోడ్లకు ఇరువైపులా ఆహ్లాదకరమైన మొక్కలు ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్ఆదేశాలు ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర పరిధిలోని నేషనల్ హైవేలపై 50వేల మొక్కలు, 25 కలెక్టరేట్లలో వెయ్యి మొక్కల చొప్పున మొత్తం 75వేల మొక్కలను హరితహారంలో నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆర్అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డిని కోరారు.
- June 23, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- PRASHANTH REDDY
- VEMULA
- నేషనల్ హైవేలు
- హరితహారం
- Comments Off on హైవేల వెంట పూల మొక్కలు