Breaking News

హెర్బల్​టీతో కరోనాకు చెక్​

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ వైరస్​కు ఇప్పటివరకు కచ్చితమైన మందు లేదు. కేవలం భౌతికదూరం పాటించటం, శానిజైటర్ల వాడకం, మాస్కులు ధరించడం వంటివి పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో మొహాలిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎన్‌ఐపీఈఆర్‌) సెఫ్టీ డివైజ్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు తయారు చేస్తున్నది. ఇప్పుడు తాజా కరోనాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్‌టీ ని తయారు చేసింది. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే కరోనాను ఎదుర్కోవచ్చు. ఈ హెర్బల్‌ టీని స్థానికంగా అందుబాటులో ఉండే ఆరు రకాల హెర్బల్స్‌ అశ్వగంధ, తిప్పతీగ, ములేటి, తులసి, గ్రీన్‌టీని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. వీటిని తగిన పాళ్లలో కలిపి ఈ హెర్బల్‌ టీని తయారు చేసుకోవాలి. దీనిని రోజుకు మూడు సార్లు తీసుకోవడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ఎన్​ఐపీఈఆర్​ తెలిపింది.