వాషింగ్టన్: హెచ్ – 1 బీ వీసాదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. అమెరికాలో రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీంట్లో భాగంగానే ఫెడరల్ ఏజెన్సీలు ఫారెన్ వర్కర్స్‌ను నియమించకుండా నిరోధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన సంతకం చేశారు. దీని ద్వారా ముఖ్యంగా హెచ్–1బీ వీసాలో ఉన్న వారిని కంపెనీ నియమించకోకూడదు. దీంతో యూఎస్ జాబ్ మార్కెట్‌పై ఆశలు పెట్టుకున్న మన ఐటీ నిపుణులకు పెద్దదెబ్బ కానుంది. అమెరికన్లను మాత్రమే నియమించుకునేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నానని అంతకు ముందు వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ప్రకటించారు. చౌకగా పనిచేసే విదేశీ కార్మికుల కోసం కష్టపడి పనిచేసే అమెరికన్లను తొలగించడం కరెక్ట్ కాదని, దాన్ని సహించబోమని ఆయన చెప్పారు. అమెరికన్లకు జాబ్ సెక్యూరిటీ కల్పించేందుకు హెచ్ – 1బీ వీసాలతో పాటు ఇతర విదేశీ వీసాలను రద్దు చేస్తున్నట్లు ట్రంప్ జూన్‌లోనే నిర్ణయం ప్రకటించారు.
- August 4, 2020
- Archive
- Top News
- జాతీయం
- AMERICA
- FEDARAL AGENCIES
- H1B VISA
- TRUMPH
- అమెరికా
- ట్రంప్
- హెచ్–1బీ వీసా
- Comments Off on హెచ్–1బీ వీసాదారులకు ట్రంప్ షాక్