Breaking News

‘హులా హూప్’.. ఆహా

‘హులా హూప్’.. ఆహా

ఓ పెద్ద రింగ్​న్​ బేస్ చేసుకుంటూ డ్యాన్స్ చేయడమే ‘హులా హూప్’ డ్యాన్స్. ఢిల్లీకి చెందిన ఈశ్న కుట్టీ ఈ డ్యాన్స్ చేయడంలో మహాదిట్ట. గత రెండేళ్లుగా తన అద్భుత పెర్ఫామెన్స్ లతో యూత్ ఫాలోయింగ్​ను సంపాదించింది. అయితే ఇప్పుడు ట్రెడిషనల్ శారీతో ఆ హులా హూప్ డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో మరిన్ని వ్యూస్ ను సొంతం చేసుకుంది. జీన్స్ టీ షర్ట్ తోనే హులా హూప్ కొంచెం కష్టం.. కానీ ఈశ్న ఆరు గజాల చీర కట్టుకుని.. రాక్ స్టెప్లతో హులా హూప్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకదాన్ని ఆమె ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. దానికి ‘సారీ ఫ్లో హ్యాష్ ట్యాగ్’ అని ఓ ట్యాగ్​లైన్​ కూడా ఇచ్చింది. చీరతో ఇలా డ్యాన్స్ పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుందని నిరూపించి ఈశ్న వీడియోను యూత్ యమా క్రేజీగా ఫాలో అయిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షలమంది నెటిజన్లు చూశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఈ వీడియో చూసి ప్రశంసలు కురిపించారట.