Breaking News

హిందీలోనూ అరుంధతి

హిందీలో అరుంధతి

జేజమ్మ గా కెరీర్​లో నిలిచిపోయే పాత్ర చేసింది అనుష్క ‘అరుంధతి’ సినిమాలో. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది కూడా. ఈ సినిమా వచ్చి దాదాపు పదకొండేళ్లు కావొస్తోంది. దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో హారర్ జానర్లో వచ్చిన ఈ చిత్రం సోనూ సూద్ కెరీర్ కూడా అమాంతం ఒక మలుపు తిప్పేసింది. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాల ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రంలో నటనకు అనుష్క ఉత్తమ నటి, సూను సూద్ ఉత్తమ సహాయ నటుడి కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. ఇక అనేక విభాగాల్లో ఈ మూవీ నంది అవార్డ్స్ అందుకోవడం జరిగింది. అయితే ఈ క్రేజీ సినిమాని ఎప్పటి నుంచో హిందీలో రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నట్టుగా వార్తొకటి వచ్చింది.

అరుంధతి విడుదలైన 11 ఏళ్లకు ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను మెగా నిర్మాత అల్లు అరవింద్ దక్కించుకున్నారు. మంచి ఫ్యాన్సీ ధరకే అరుంధతి హిందీ రీమేక్ హక్కులను తీసుకున్నారని..మరో నిర్మాత మధు మంతెనతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. చెప్పొచ్చేదేమిటంటే.. ‘అరుంధతి’ హిందీ రీమేక్ లో అనుష్క పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ని తీసుకోవాలనుకుంటున్నారట. ఆమె ఒప్పుకుంటే మాత్రం ఈ ప్రాజెక్టుకు మరింత హైప్ అవ్వడం ఖాయమంటున్నారు.