సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలను పూర్తిగా శాస్త్రీయ పద్ధతుల్లో మట్టి తీసి, వర్మి కంపోస్టు ఎరువును వాడుతూ నాటాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో హనోక్ పాల్గొన్నారు.
- June 22, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- HARITHAHARAM
- medak
- ఎర్రబెల్లి
- మెదక్
- హరితహారం
- Comments Off on హరితహారానికి రెడీ కండి