Breaking News

హరితహారానికి అంతా రెడీ


సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం నిర్వహించే ఆరో విడత హరితహారం కార్యక్రమానికి అంతా రెడీచేశామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఎమ్మెల్యే కాలనీలోని విజయ నర్సరీని బుధవారం ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. 29 నర్సరీలు 50 లక్షల మొక్కలతో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్​నగర ప్రజలు విరివిగా పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు