ఫామ్ లో ఉండగానే కొంతమంది హీరో హీరోయిన్లు రకరకాల బిజినెస్లు చేస్తున్నారు. అయితే అవకాశాలు తగ్గి బెలూన్ల బిజినెస్ మొదలెట్టిందన్న రూమర్ తో అగ్గి మీద గుగ్గిలం అవుతోంది స్టార్బ్యూటీ హన్సిక. తెలుగు, తమిళ చాలా చిత్రాల్లో నటించింది. ఒకటి రెండు లేడీ ఒరియెంటెడ్ మూవీలు కూడా చేసింది. చివరగా తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏ బీయ్’ లో సందీప్ కిషన్ కు జోడీగా నటించినా ఆ సినిమాతో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
హన్సికకు తెలుగులో ఆఫర్లు తగ్గినా తమిళంలో మాత్రం శింబూకు జోడీగా ‘వేట్టై మన్నన్’, ఆది సరసన ‘పార్టనర్’ మూవీలు చేస్తోంది. ఇదే సమయంలో తమిళ మీడియా సంస్థ ఒకటి హన్సిక బెలూన్ల బిజినెస్ చేస్తోందన్న కథనాన్ని ప్రసారం చేసింది. హన్సిక రిలేషన్స్ లో ఒకరు ఫంక్షన్స్ లో డెకరేషన్ కోసం బెలూన్లను సప్లయ్ చేస్తారట. దాంతో హన్సిక కూడా ఆ బిజినెస్ లో వాటా ఉందని వాళ్లు అనడంతో ఆమె సీరియస్ అవుతూ..‘ ఊహకు కూడా అందని దాని గురించి మీరు చెప్పినందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది.. నేను ఎలాంటి బిజినెస్ చేయాలో నాకు ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్.. నిజంగా ఈ వార్త నాకు పిచ్చెక్కించేలా ఉంది..’ అంటూ సినిమాలు తప్ప నాకే బిజనెస్ లేదన్న క్లారిటీ వచ్చేలా స్ట్రాంగ్ ధమ్కీ ఒకటి ఇచ్చింది.