సారథి న్యూస్, హుస్నాబాద్: దళితుల హక్కుల సాధనకు ఎమ్మార్పీఎస్ నిరంతర పోరాటాలు చేస్తుందని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జేపీ లత అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగరవేసి మాట్లాడారు. మాదిగలంతా ఏకతాటిపైకి వచ్చి ఏబీసీడీ వర్గీకరణకు పోరాడలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వృద్ధాప్య, వితంతువులు, వికలాంగుల పెన్షన్, ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలు మంద కృష్ణ మాదిగ పోరాటాల ఫలితమేనన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకటస్వామి, నాయకులు లక్ష్మీనారాయణ, మహేందర్, భిక్షపతి, ప్రకాశ్, సంపత్, సుధాకర్ పాల్గొన్నారు.
- July 7, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- MANDAKRISHNA
- MRPS
- ఎమ్మార్పీఎస్
- వర్గీకరణ
- Comments Off on హక్కుల సాధనకు ఎమ్మార్పీఎస్ పోరాటం