![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/bwf-f.jpg?fit=696%2C464&ssl=1)
న్యూఢిల్లీ: రివైజ్డ్ షెడ్యూల్లో సరైన విండో లేకపోవడంతో.. స్విస్ ఓపెన్, యూరోపియన్ ఓపెన్ టోర్నీలను అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) రద్దు చేసింది. కరోనా ఇప్పుడప్పుడే అదుపులోకి వచ్చే అవకాశం లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణం. షెడ్యూల్ ప్రకారం స్విస్ ఓపెన్ మార్చి 17 నుంచి 22 వరకు, యూరోపియన్ టోర్నీ ఏప్రిల్ 21 నుంచి 26 వరకు జరగాల్సి ఉన్నాయి. ఇక గత కొద్ది నెలలుగా ఎలాంటి టోర్నీలు జరగకపోవడంతో.. మార్చి 17 నాటికి ర్యాంక్‌లను బీడబ్ల్యూఎఫ్ ఫ్రీజ్ చేసింది.