చబ్బీ చీక్స్ రాశిఖన్నా అన్లాక్ తర్వాత కొంచెం స్పీడ్ పెంచినట్టే ఉంది. ఒకేసారి వరుస సినిమాలను లైన్ లో పెట్టేస్తోంది. అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత రాశి తెలుగు సినిమాలకు కమిట్మెంట్ ఏమీ ఇవ్వకుండా.. ‘మేధావి’, ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3’, ‘సైతాన్ క బచ్చా’ ఇలా వరుస తమిళ సినిమాలకు కమిటవ్వడంతో రాశి ఇంకా తెలుగులో కనిపించదేమో! అని పుకార్లు గుప్పించేశారంతా. అదేమీ కాదు ‘నేను ఆడా ఉంటా..ఈడా ఉంటా.. హీరో హీరోయిన్లకు ఏ భాషైనా తేడా ఏమీ ఉండదు.. ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడికి వెళ్లాల్సిందే అంటోంది’ రాశి. ఇప్పుడు తెలుగులో కూడా రెండు ఆఫర్లు ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి ‘సోలో బ్రతుకే సో బెటర్’ తర్వాత సాయితేజ్ దేవా కట్టా మూవీ ఉంటుందని అనౌన్స్ చేశాడు. అందులో ఒక హరోయిన్ నివేదా పేతురాజ్. అయితే రెండో హీరోయిన్ గా రాశిని తీసుకున్నారని టాక్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఆర్మీ నేపథ్యంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది తమిళం, తెలుగు బైలింగ్వల్ మూవీ. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉండే చాన్స్ ఉంది. ఒక హీరోయిన్ పూజాహెగ్డే. రెండో హీరోయిన్ గా ముందు రష్మికను అనుకున్నారట. ఏమైందేమో రష్మిక కాదు రాశి నటించనుందని ఇప్పుడంటున్నారు. ఈ ముచ్చట పక్కన పెడితే రాశి బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతోందట. ‘ది ఫ్యామిలీ మెన్’ సిరీస్ ను రూపొందించిన రాజ్ అండ్ డీకే ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ రీమేక్ లో నటించిన షాహిద్ కపూర్ తో ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారట. లీడ్ రోల్ లో రాశి ఖన్నాను అనుకుంటున్నారట. అలాగే కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా ఈ సిరీస్ లో కీలకపాత్రలో కనిపించనున్నారట. ఒకేసారి తెలుగు, తమిళం, హిందీలలో కనిపించనుందంటే రాశి కెరీర్ కి ఇప్పట్లో ఫుల్స్టాప్ లేనట్టేగా!
- December 27, 2020
- Archive
- సినిమా
- MEDHAVI
- POOJAHEGDE
- RASIKHANNA
- TOLLYWOOD
- టాలీవుడ్
- పూజాహెగ్డే
- మేధావి
- రష్మిక
- రాశిఖన్నా
- Comments Off on స్పీడ్ పెంచిన.. రాశిఖన్నా