సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తొలి రోజు పాఠశాలకు వెళ్లిన ఒక ప్రభుత్వ టీచర్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మెదక్‌జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో శంకర్‌నాయక్ ఎస్జీటీగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులందరూ 27 నుంచి పాఠశాలలకు రావాలని ఆదేశించడంతో.. గురువారం ఉదయం స్కూలుకు బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో కాలినడకన పాఠశాలకు వెళ్తుండగా.. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో శంకర్‌నాయక్ ఎడమకాలు ఛిద్రమైంది. తీవ్రంగా రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు ఆయనను 108 వాహనంలో సమీపంలోని దవాఖానకు తరలించారు.
- August 27, 2020
- Archive
- క్రైమ్
- మెదక్
- లోకల్ న్యూస్
- CRIME
- LORRY
- ROAD ACCIDENT
- TEACHER
- టీచర్
- రోడ్డుప్రమాదం
- లారీ
- Comments Off on స్కూలుకు వెళ్తూ.. తొలిరోజే విషాదం