సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కంటైన్ మెంట్ జోన్ పీఎన్ కాలనీలో కలెక్టర్ జె.నివాస్ శనివారం పర్యటించారు. ప్రజలకు సౌకర్యాలు ఏ మేరకు అందుతున్నాయో పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు.
కాలనీలో ప్రతిఇంటికి తాగునీరు, కిరాణా సామగ్రి, కూరగాయలు, మందులు నిత్యావసర సరుకులు విధిగా అందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులకు కూడా పాలు, సిరిలాక్ వంటి బేబీ ఆహార పదార్థాలను అందజేయాలని సూచించారు.
ప్రతిఒక్కరూ ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించడంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. కార్యక్రమంలో నగర పాలకసంస్థ కమిషనర్ పి.నల్లనయ్య, ఆరోగ్య అధికారి జి.వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.