సారథి న్యూస్, కర్నూలు: బీజేపీలో విధేయుడిగా ఉంటూ కార్యకర్తలు, నాయకులను సమన్వయపరచడంలో విజయం సాధించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుగా నియమించడం అభినందనీయమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారధి అన్నారు. ఈ మేరకు ఆయనకు విషెస్ చెప్పారు. 30 ఏళ్లకుపైగా రాజకీయ అనుభవం ఉన్న సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా స్పందిస్తూ కౌంటర్ ఇవ్వడంలో సోము వీర్రాజు సాటిలేరని కొనియాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమన్నారు.
- July 31, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ANDRAPRADESH
- BJP
- SOMU VEERRAJU
- ఆంధ్రప్రదేశ్
- బీజేపీ
- సోము వీర్రాజు
- Comments Off on సోము వీర్రాజుకు విషెస్