పుణే: సైకో భర్త నీచమైన లైంగికకోరికలు తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన ఈ నీచుడు ఫోర్న్ సినిమా తరహాలో సెక్స్ కావాలంటూ భార్యను వేధించేవాడు. ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడు. దీంతో శాడిస్ట్ మొగుడి టార్చర్ తట్టుకోలేక.. పుట్టింటికి వచ్చిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మహారాష్ట్రలోని పూణెకు చెందిన రతన్ లాల్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కూతురును 2019లో లండన్‌లో ఉద్యోగం చేస్తున్న దినేశ్ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. దినేశ్‌కు 10 లక్షల రూపాయల కట్నం, బంగారంతోపాటు అన్ని లాంచనాలు ముట్టజెప్పారు పుట్టింటివాళ్లు. అనంతరం దినేశ్.. భార్యను యూకేకు తీసుకెళ్లాడు. పైళ్లైన నాటినుంచే అతడి నీచపు బుద్ధిని చాటుకున్నాడు. అతడు పెట్టే చిత్రహింసలు భరించలేక వారం క్రితమే పుట్టింటికి వచ్చింది యువతి.. భర్త చిత్రహింసలు పెడుతున్నాడని.. అతడి స్నేహితులతో గడపమని ఒత్తిడి చేస్తున్నాడని.. మాట వినకపోతే తీవ్ర హింసలు పెడుతున్నాడని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం తీవ్ర డిప్రెషన్‌కు గురైన యువతి శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేనిసమయంల చూసి నిద్రమాత్రలు తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
- September 6, 2020
- Archive
- Top News
- క్రైమ్
- జాతీయం
- HUSNABAD
- LONDON
- MAHARASTRA
- PUNE
- UK
- WIFE
- ఆత్మహత్య
- నిద్రమాత్రలు
- భర్త
- భార్య
- మహారాష్ట్ర
- వేధింపులు
- Comments Off on సైకో భర్త నీచపు కోరికలు.. భార్య ఆత్మహత్య