టాలీవుడ్లో యంగ్ హీరోలు వెలువలా వస్తున్నారు. ‘రాజా వారు రాణిగారు’ వంటి నేచురల్ ప్రేమకథా చిత్రంతో హీరోగా పరిచయమైన కిరణ్ సబ్బవరం తొలిచిత్రంతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. దాంతో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ‘ఎస్ఆర్. కల్యాణ మండపం, Est. 1975’ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇదిలా ఉండగా కిరణ్ సబ్బవరం తాజాగా మరో చిత్రానికి కమిటయ్యాడు. ‘Est. 1975’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తాజాగా కిరణ్ అబ్బవరంతో ‘సెబాస్టియన్ పీసీ 524’ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ చిత్రంలో కిరణ్ పోలీస్ కానిస్టేబుల్ గా, రేచీకటితో బాధపడే యువకుడిగా కనిపించనున్నాడు. ఇదే థీమ్‌తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రమోద్, రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ ఫిస్ట్ లుక్ పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ద్వారా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.