న్యూఢిల్లీ: సెప్టెంబర్ 10వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ రోజు లోకసభ, మరోరోజు రాజ్యసభ సమావేశాలు జరుగుతాయని సమాచారం. ఇలా నాలుగు వారాల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ఎంపీలందరికీ ‘ఆరోగ్య సేతు’ యాప్ కచ్చితంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని నిబంధన విధించారు. స్క్రీనింగ్ నిర్వహణతో పాటు శానిటైజింగ్ వ్యవస్థ ప్రతి చోటా ఉంటుందని పేర్కొన్నారు. ఆయా సభ్యుల వ్యక్తిగత సిబ్బందికి మాత్రం పార్లమెంట్‌లోకి అనుమతి ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు.
- August 22, 2020
- Archive
- Top News
- జాతీయం
- AROGYASETHU
- CARONA
- NEWDELHI
- PARLAMENT MEETING
- ఆరోగ్యసేతు
- న్యూఢిల్లీ
- పార్లమెంట్
- వర్షాకాల సమావేశాలు
- Comments Off on సెప్టెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు