Breaking News

‘సునీల్ రావు.. నీకంత స్థాయి లేదు’

సునీల్ రావు.. నీకంత స్థాయి లేదు

సారథి న్యూస్, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ, నేతలను విమర్శించే స్థాయి కరీంనగర్ మేయర్ సునీల్ రావుకు లేదని, ఆ పార్టీ బీసీసెల్ జిల్లా చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వసుపత్రుల పనితీరు మెరుగుపడాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క యాత్ర చేపడితే టీఆర్ఎస్ ​నేతలు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే కరోనా ఉధృతితో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాల్సింది పోయి సిగ్గులేకుండా విమర్శలు చేయడం మేయర్​ సునీల్​రావుకు తగదన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి కనీసం 15 రోజులకు ఒకసారి కూడా ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించిన పాపానపోలేదన్నారు. కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు గురించి ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. మేయర్​ తన పదవిని కాపాడుకునేందుకు తాపత్రయ పడుతున్నారని ఎద్దేవాచేశారు.