న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పదోతరగతి రిజల్ట్స్ విడుదలయ్యాయి. బుధవారం ఉదయం ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఉమాంగ్ యాప్, టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఈ ఏడాది 91.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణతశాతం పెరిగింది. దాదాపు 41,804 మంది విద్యార్థులు 95 శాతం మార్కులు స్కోర్ చేశారు. సీబీఎస్‌ఈ ఇప్పటికే పన్నెండోతరగతి ఫలితాలు విడుదల చేసింది. కరోనా కారణంగా టెన్త్, పన్నెండోతరగతి పరీక్షలను మధ్యలోనే రద్దు చేశారు. సీబీఎస్‌ఈ ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా రిజల్ట్స్ ఇచ్చారు. రిజల్ట్స్‌ను cbseresults.nic.inలో చూసుకోవచ్చు.
- July 15, 2020
- Archive
- Top News
- జాతీయం
- CBSE
- PASS
- PERCENTAGE
- RESULTS
- సీబీఎస్‌ఈ
- Comments Off on సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాలు విడుదల