- ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ
సారథి న్యూస్, పెద్దపల్లి: గోదావరి నీటి విషయంలో కరీంనగర్, పెద్దపెల్లి జిల్లాలకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని ఆర్టీసీ మాజీ చైర్మన్, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హెచ్చరించారు. రెండు జిల్లాలకు మూడు పంటలకు నీళ్లు ఇచ్చిన తర్వాతే మిగతా నీటిని బయటకు తీసుకెళ్లాలని సూచించారు. మంగళవారం రామగుండంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి జలాల గురించి సీఎం కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం నీటిని కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఇవ్వడం లేదన్నారు. నీటిజలాల వినియోగంపై నిపుణుల సలహాలు తీసుకోవాలని, ఒంటెద్దు పోకడలు మానుకోవాలని హితవుపలికారు.