![సీఎంగా కోట శ్రీనివాసరావు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/kota-222.jpg?fit=450%2C563&ssl=1)
జులై 10న సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘రోరి’ సినిమాలోని లుక్ రిలీజ్ చేశారు టీమ్ సభ్యులు. ఏ పాత్రకైనా హుందాతనాన్ని తెచ్చే కోట పొలిటికల్ క్యారెక్టర్స్ ఎన్నో పోషించారు. కానీ సీఎం పాత్రలో ఇప్పటిదాకా నటించలేదు. చరణ్ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రోరి’ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర పోషించనున్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఆర్.రామన్న చౌదరిగా సెన్సిటివ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు కోట శ్రీనివాసరావు. సీటీఎస్ స్టూడియోస్, ఎస్ టీవీ ఎంటర్ టెయిన్స్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.