‘బాయ్స్’ సినిమాతో ఇండస్ట్రీకొచ్చిన సిద్దార్థ తమిళ వాడే అయినా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి లవ్ స్టోరీస్‌తో తెలుగులోనే ఎక్కువ ఆదరణ పొందాడు. అనుకోకుండా తెలుగులో తనకు లాంగ్ గ్యాప్ వచ్చింది. ఎన్టీఆర్ ‘బాద్ షా’ తర్వాత మళ్లీ తెలుగులోపూర్తిస్థాయిలో కనిపించలేదు. 8 ఏళ్లకు మళ్లీ ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు సిద్ధార్థ్. శర్వానంద్ హీరోగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘మహాసముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత.
ఇటీవల ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన ఏకే ఎంటర్ టైన్మెంట్స్, సిద్ధార్థ్ కూడా ఇందులో నటించబోతున్న విషయాన్ని శుక్రవారం రివీల్ చేసింది. దీంతో సిద్ధార్థ్ ఇందులో నటిస్తున్నాడని జరుగుతున్న ప్రచారం నిజమైంది. కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేస్తున్న సిద్ధార్థ్, సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అజయ్ భూపతి రాసిన పవర్ఫుల్ క్యారెక్టర్ నచ్చడంతో, తన కమ్ బ్యాక్ కు ఇదే కరెక్ట్ మూవీగా భావించినట్టు తెలుస్తోంది. మరి ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో సిద్దార్థ్ తెలుగులో మళ్లీ బిజీ కావచ్చు.