సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడ్‌పల్లి, జేబీఎస్, బేగంపేట, లంగర్‌హౌస్, గోల్కొండ, టోలీచౌకి, కార్వాన్, మెహిదీపట్నం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, గాజులరామారం, షాపూర్‌నగర్, కూకట్‌పల్లి, కొంపల్లి, సుచిత్ర, చింతల్, దుండిగల్, రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, కిస్మత్‌పూర్, బండ్లగూడ జాగీర్, శంషాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ నిలిచిన ప్రాంతాల్లో అధికారులు మరమ్మతులు చేపట్టారు.
- April 20, 2020
- Top News
- తెలంగాణ
- ఈదురుగాలులు
- వర్షం
- సిటీ
- హైదరాబాద్
- Comments Off on సిటీలో వర్షం