Breaking News

సిటీలో డ్రింకింగ్​ వాటర్​ ఫ్రీ

సిటీలో డ్రింకింగ్​ వాటర్​ ఫ్రీగా సఫ్లై

  • 10.8 లక్షల నల్లా కలెక్షన్లకు బెనిఫిట్​
  • 20వేల లీటర్లు దాటితే బిల్లు కట్టాల్సిందే
  • మార్చి 31లోపు మీటర్​ బిగించుకోవాల్సిందే
  • ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ఇక నుంచి ఫ్రీగా డ్రింకింగ్​ వాటర్​ అందనుంది. గ్రేటర్​ హైదరాబాద్ ​ఎన్నికల హామీలో భాగంగా ఈ మేరకు మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం నగర వాసులకు ‘ఉచిత తాగునీటి’ పథకాన్ని రెహ్మత్​నగర్​లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ లో 10.8 లక్షల నల్లా కలెక్షన్లకు ఫ్రీగా తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో గ్రేటర్ పరిధిలో 97శాతం మందికి లబ్ధి కలుగుతుందన్నారు. ఉచితంగా తాగునీరు కావాలంటే మార్చి 31లోపు తప్పనిసరిగా మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిందేనని సూచించారు. మురికివాడల్లో ఉండే ప్రజలకు మీటర్​ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 20వేల లీటర్లు దాటితే బిల్లు కట్టాల్సి ఉంటుందన్నారు. 10.8 లక్షల నల్లా కలెక్షన్లకు ఉచితంగా నీటి సరఫరా ద్వారా జలమండలి నెలకు రూ.19.92 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుందని వివరించారు. కార్యక్రమంలో మంత్రులు డిప్యూటీ సీఎం మహమూద్​ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబాఫసియోద్దిన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, వివేకానంద, ఎమ్మెల్సీ మల్లేశం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్​ఎంసీ కమిషనర్ ​లోకేష్ కుమార్, టీఆర్ఎస్​ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఉచిత తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి కె.తారక రామారావు, చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు